గుంటూరు జిల్లా, పాత గుంటూరు లోని శ్రీలక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వాముల దేవాలయ పరిరక్షణ పోరాటంలో శ్రీ శ్రీ శ్రీ శివస్వామిజీ తో కలిసి అడుగేసిన హైందవశక్తి.
Dharma Pracharam
GUNTUR
28-05-2021
Protecting Temples From Attacks
GUNTUR(M)
ANDHRA PRADESH
GUNTUR
Description:
హైందవశక్తి - దేవాలయ పరిరక్షణ - న్యాయబద్ధమైన పోరాటం - పాత గుంటూరు - శుద్ధపల్లి డొంక - శ్రీలక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వాముల - దేవాలయ - పరిరక్షణ - పోరాటంలో - శ్రీ శ్రీ శ్రీ శివస్వామిజీ తో కలిసి - అడుగేసిన - హైందవశక్తి. హైందవశక్తి, 28/05/2021. గుంటూరు జిల్లా,పాత గుంటూరు లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యస్వామి వార్ల దేవస్థానాన్ని ((గోశాలకు - కళ్యాణమండపానికి కేటాయించిన స్థలంలో)) గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు కోవిడ్ కేర్ సెంటర్ కట్టాలనే ఆలోచనతో - చట్టపరంగా ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే,పోలీసు వారి సహాయంతో 23-05-2021 ఉదయం 07:30 గంటలకు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. స్థానిక భక్తులు మరియు దేవాలయ కమిటీ ద్వారా సమస్యని తెలుసుకున్న హైందవశక్తి వెంటనే రంగంలోకి దిగి దాదాపు 50 మందితో నిరసన,వ్యతిరిక్తత తెలియచేయటంతో, మూడు రోజులు సమయం ఇచ్చి,దేవాలయాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నాన్ని విరమించుకొని వెళ్ళిపోయారు సంబంధిత అధికారులు.దేవాలయ పరిరక్షణ విషయం హిందూ సంఘాల ఐక్యవేదిక శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ గారి దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే తేదీ 25-05-2021 న సదరు దేవాలయ కమిటీ లాయర్ గారు- హైందవశక్తి జిల్లా కమిటీ వారు కలసి వెళ్లి,గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని ""దేవాలయం యథాస్థితి కొనసాగడానికి స్టే ఇవ్వమని"" లిఖితపూర్వకంగా అభ్యర్దించడం జరిగింది. తేదీ 28-05-2021న తాళ్లాయపాలెం శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శివ స్వామి గారు సదరు దేవాలయానికి విచ్చే శారు.ఆయన అక్కడి ఉద్రిక్త పరిస్థితులు సద్దుమ నిగి స్థానికులకు సకల శుభాలు జరిగేలా వారిచేత ""లోక కళ్యాణ క్షేమ హోమం"" జరిపించారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాన్ని పరిరక్షించు కోవటానికి దేనికైనా సిద్ధమేనని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియచేసారు.అందుకు అవసరమైతే హిందూ సంఘాల ఐక్య వేదిక తరఫున చట్టబద్ధమైన పోరాతానికి కూడా తాము సిద్ధమేనని,కోవిడ్ కేర్ సెంటర్ మరొకచోట నిర్మించుకోవాలని ప్రభుత్వానికి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీశ్రీ శివ స్వామి గారి భక్తులు మరియు శ్రీశ్రీశ్రీశివ స్వామి వారి శిష్యులు భవాని స్వామి గారు,ఆలయ కమిటీ మెంబర్ రాము గారు,ఆలయ చైర్మన్ పొదిలి మహేష్ గారు,న్యాయ పరిషత్ నుంచి కొంతమంది లాయర్లు ఇంకా హైందవ శక్తి గుంటూరు టీం పాల్గొనడం జరిగింది.అందుకే మేమంటాము................................................... హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
