ప్రకాశం జిల్లా, రాచర్లమండలం, రాచర్ల గ్రామంలో అక్రమ చర్చ్ నిర్వహణ పై ఎస్. పి. గారికి వాట్సాప్ ఫిర్యాదు చేసి అడ్డుకున్న హైందవశక్తి.
Victory
PRAKASAM
10-05-2021
Illegal Church Construction Stopped
RACHERLA
ANDHRA PRADESH
RACHERLA
Description:
హైందవశక్తి - న్యాయబద్ధమైన పోరాటం - రాచర్ల గ్రామంలో - అక్రమ చర్చ్ నిర్వహణ - ఎస్. పి. గారికి వాట్సాప్ ఫిర్యాదు చేసి - అడ్డుకున్న- ప్రకాశం జిల్లా - హైందవశక్తి. హైందవశక్తి, 10/05/2021. ప్రకాశం జిల్లా,రాచర్లమండలం,రాచర్లగ్రామ పంచాయితీలో ప్రభుత్వభూమిని ఆక్రమించి ""హోసన్నా మందిర్"" వాళ్ళు అక్రమచర్చ్ నిర్మాణం చేస్తున్న విషయంగా హైందవశక్తి చేస్తున్న పోరాటం గత ఫేస్బుక్ పోస్ట్ లలో చూసే వుంటారు. సదరు విషయంగా నిన్న అనగా 09/05/2021 వ తేదీ ఆదివారం ((కరోనా నేపథ్యం లో అన్ని దేవాలయాలు,చర్చ్ లు, మసీదులు మూత పడినా)) అక్రమమార్గంలో - దొంగరిజిస్ట్రేషన్ లు చేసి - ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించి - నూతనంగా నిర్మించిన ""హోసన్నా చర్చ్"" వారు ప్రభుత్వహెచ్చరికలను పట్టించుకోకుండా గుంపులుగా కూడి అధికారుల అండతోనే ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఇలా మనం ఎందుకు అనవలసి వచ్చిందంటే నిన్నటి సంఘటన దృష్ట్యా,అధికారుల్లో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు 144 సెక్షన్ అమలు చేస్తున్న తరుణంలో కూడా, పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల లోపల ఈ అక్రమ చర్చ్ నిర్మాణం, ప్రార్థననిర్వహిస్తున్న ప్పటికీ;ఎస్.ఐ గారికి సదరు విషయాన్ని ఫోన్ లో తెలియచేసినా,ఎస్.ఐ.గారు పట్టించుకోకపోవడం ఇందుకు చక్కని ఉదాహరణ. స్థానిక హైందవశక్తి కార్యకర్తలు వెంటనే,ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ ఈమని.బలరాం గారిని సంప్రదించారు.ఆయన సలహా మేరకు యెస్.పి. గారికి సదరు వ్యవహారం విషయంగా వాట్సాప్ ఫిర్యాదులు వెళ్ళాయి.ఆ స్క్రీన్ షాట్ ఈ క్రింది ఇమేజస్ లో చూడవచ్చు. ఎస్.పి గారి ద్వారా సి.ఐ. గారికి, సి.ఐ.గారి ద్వారా ఇంతక ముందు మనం ఏ ""యెస్.ఐ."" గారికి అయితే ఫిర్యాదు చేసామో ఆయనే స్వయంగా వచ్చి అర్ధాంతరంగా ప్రార్ధనలు ఆపించి,అక్కడినుంచి జనాన్ని పంపించివేశారు.ఇలా ఒక అక్రమ ప్రార్ధనను అడ్డుకున్న రాచెర్ల హైందవశక్తి కార్యకర్తలకు,వారికి అడుగడుగునా వెన్ను దన్నుగా ఉండి న్యాయ పరమైన సలహాలు ఇస్తున్న ఈమని. బలరాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.అందుకే ఎప్పటినుంచో మేమంటున్నాము...................... హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9494023056. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
