కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి - వి.హెచ్ పి.,భజరంగ్ దళ్ తో కలిసి హైందవశక్తి ధర్మపోరాటం................
Fighting
KONASEEMA
09-09-2020
Protecting Temples From Attacks
SAKHINETIPALLI
ANDHRA PRADESH
ANTERVEDI
Description:
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి - వి.హెచ్ పి.,భజరంగ్ దళ్ తో కలిసి హైందవశక్తి ధర్మపోరాటం................ 09/09/2020. ఆంధ్రప్రదేశ్ లో మత్తు నిద్ర నటిస్తున్న హిందువులారా.,సెక్యూలర్ లారా.....హిందూ ధర్మం పై,హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను గమనించి ఇప్పటికైనా మేల్కొనండి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం అగ్నికి ఆహుతి చేసిన దుండగులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని శాంతియుతంగా నిరసన తెలియచేసే కార్యక్రమంలో వి.హెచ్.పి,భజరంగ్ దళ్ లతో పాటుగా హైందవశక్తి కూడా పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో నిన్న (08/09/2020న)మన హైందవశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు - హైందవశక్తి సింహం శ్రీ sedimbi. prasad గారు,full timer వీరేంద్రకుమార్ గారు,కొల్లి.భవాని గారు,ఒక అజ్ఞాత వ్యక్తి కూడా పాల్గొన్నారు. మన తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ వంశీ శర్మ భారీస్థాయిలో హైందవశక్తి సభ్యులను అందునా ముఖ్యంగా యువతను వెంట పెట్టుకొని అంతర్వేది చేరుకున్నారు. తేనె తుట్టి కోసం నిప్పుపెట్టి రధం తగలబెట్టిన దుండగులని పట్టుకోలేని పోలీస్ యంత్రాంగం......ఆడ మగ అని తేడా చూడకుండా అందర్నీ పోలీస్ స్టేషన్ కి తరలించి నిన్న అంతా నిర్బంధించి ఉంచారు. నిన్న రాత్రి 8 గంటల తర్వాత ఆడవారిని.. ((లేడీ కానిస్టేబుల్,లేడీ పోలీస్ ఆఫీసర్ స్టేషన్లో లేనప్పుడు))ఎలా నిర్బంధిస్తారు అని sedimbi. prasad గారు ప్రశ్నించగా....వారి వరకూ వదిలిపెట్టారు. మన ప్రసాదు గారిని,వీరేంద్రకుమార్ గారిని ఇంకా మిగిలిన సభ్యులను సినీ ఫక్కీలో ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కు మారుస్తూ,ఆచూకీ తెలియకుండా నిర్బంధించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది. పోరాటం అంటే హైందవశక్తి.. హైందవశక్తి అంటేనే పోరాటం....
