కోనసీమ జిల్లా. సకినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలోని అక్రమ చర్చ్ లు అనుమతులు గురించి సమాధానం రాకపోతే మొదటి అప్పీల్ కు వెళ్లిన హైందవశక్తి.
Fighting
KONASEEMA
25-11-2020
Protecting Temples From Attacks
SAKHINETIPALLI
ANDHRA PRADESH
ANTERVEDI
Description:
హైందవశక్తి - చట్టబద్ధమైన పోరాటం - సమాచారహక్కు చట్టం - 2005 క్రింద - అంతర్వేది గ్రామ పంచాయతీ కి - ఆ గ్రామంలోని చర్చ్ లు - అనుమతులు - సమాధానం రాకపోతే - మొదటి అప్పీల్కు వెళ్లిన హైందవశక్తి. హైందవశక్తి, 25/11/2020. కోనసీమ జిల్లా, సకినేటిపల్లి తాలూకా,అంతర్వేది/అంతర్వేదిపాలెం గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం రధం గుర్తు తెలియని దుండగులు తగలబెట్టిన సంఘటన మనందరికీ తెలుసిందే.అక్కడ జరిగిన ఈ దుస్సంఘటన పై నిరసన తెలియ చేయటానికి వెళ్లిన మన హైందవశక్తి కార్యకర్తలపై పోలీస్ శాఖవారు కేసులు పెట్టిన విషయం కూడా మనందరికీ అవగతమే. పై సందర్భంలో అసలు అంతర్వేది గ్రామంలో ఎన్ని చర్చ్ లకు అనుమతులున్నాయి అనే విషయంగా సమాచారహక్కు చట్టం - 2005 క్రింద సదరు గ్రామ పంచాయతీకి 14/09/2020వ తేదీన దరకాస్తు చేసింది మన హైందవశక్తి.సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం గరిష్ట కాలపరిమితి 30 రోజులు దాటిపోయినా కూడా మనకు ఎటువంటి సమాచారం అందకపోవటంతో తేదీ 18/11/2020న సకినేటిపల్లి ఎం.డి.ఓ గారికి మొదటి అప్పీల్ ను వేయటం జరిగింది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ గ్రామంలో ఒక్క చర్చ్ కి కూడా ప్రభుత్వ అనుమతులు లేవు.ఏది ఏమైనా మన హైందవశక్తి చట్టబద్ధంగా తగిన సాక్ష్యాలు,ఆధారాలు సంపాదించి కోర్ట్లొ ప్రవేశపెట్టి హిందువులకు న్యాయం జరిగేలా పోరాటం చేయటంలో ముందుంటుంది మన హైందవశక్తి అని తెలియ చేసుకుంటున్నాము. హైందవశక్తి అంటే పోరాటం......... పోరాటం అంటేనే హైందవశక్తి....... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం.చంద్రశేఖర్ - 8096311785.
