అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం,నునపర్తి గ్రామంలో రామాలయం వద్ద దేవాలయం భూమిని ఆక్రమించి ""స్మార్ట్ పురం"" క్రింద సెల్ టవర్ నిర్మాణాని అడ్డుకున్న హైందవశక్తి.
Victory
ANAKAPALLE
30-12-2020
Protecting Temples From Attacks
ATCHUTAPURAM
ANDHRA PRADESH
NUNAPARTHI
Description:
హైందవశక్తి, 29/12/2020. అనకాపల్లి జిల్లా,అచ్యుతాపురం మండలం,నునపర్తి గ్రామంలో రామాలయం వద్ద దేవాలయం భూమిని ఆక్రమించి ""స్మార్ట్ పురం"" క్రింద సెల్ టవర్ నిర్మించటానికి ప్రయత్నించాయి కొన్ని శక్తులు. దేవాలయం భూమి ఆక్రమణకు గురి అవుతుంది అని పసిగట్టిన మన హైందవశక్తి కార్యకర్తలైన స్థానిక ప్రజలు వెంటనే సమస్యను మన హైందవశక్తి విశాఖ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గొర్లి.విజయలక్ష్మి గారి దృష్ఠికి తీసుకు వచ్చారు. విజయలక్ష్మి గారి సలహా మేరకు స్థానికులు మూకుమ్మడిగా గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్లి తమ అభ్యంతరం తెలియచేసారు.విజయలక్ష్మి గారు కూడా సర్పంచ్ గారితో ఫోన్ లో మాట్లాడారు. హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ధూపం. చంద్రశేఖర్ గారి చేత పంచాయతీ సెక్రటరీ గారితో మాట్లాడించారు.అటు గ్రామ సర్పంచ్ గారి దగ్గర నుంచి,ఇటు పంచాయతీ సెక్రెటరీ దగ్గర నుంచి కూడా సానుకూల స్పందన రావటం చేత సదరు సెల్ టవర్ నిర్మాణం గ్రామ సచివాలయం దగ్గర చేసుకున్నారు.ఆ విధముగా నునపర్తి గ్రామంలో స్థానిక హిందువులు ఐక్యత ప్రదర్శించి దేవాలయం భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకో గలిగారు.అందుకే మేము అంటాము.... హైందవశక్తి అంటే పోరాటం...................... పోరాటం అంటేనే హైందవశక్తి....................